Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.9,250
Post offcie Scheme: మీరు ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా..?;
Post offcie Scheme: మీరు ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా..? సురక్షితమైన ప్లాట్‌ఫాం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పోస్టాఫీసులో ఉండే అద్భుతమైన స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు మీ భార్య పేరు మీద పెట్టుబడి పెడితే మీకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. మరి ఆ ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం.
పోస్టాఫీసులో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత అధిక మొత్తంలో ఆదాయం అందుకోవచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ కింద ఒక్క ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అదే సమయంలో జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల పరిమితి ఉంది.
ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.4 శాతం. అయితే 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మొత్తం ప్రధాన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీన్ని మరో 5-5 ఏళ్లు పొడిగించవచ్చు. ప్రతి 5 సంవత్సరాల తర్వాత అసలు మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి లేదా పథకాన్ని పొడిగించడానికి ఒక ఎంపిక ఉంటుంది. ఖాతాపై వచ్చే వడ్డీ మీ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెలా చెల్లింపు ఉంటుంది.
జాయింట్ అకౌంట్‌తో ప్రయోజనం ఏంటి?
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో నెలవారీ ఆదాయం హామీ ఇవ్వబడుతుంది. ఉదాహరణకు.. భార్యాభర్తలు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో రూ.15 లక్షలు జమ చేశారనుకుందాం. దీనిపై 7.4 శాతం చొప్పున వార్షిక వడ్డీ లభిస్తుంది. అంటే రూ.1,11,000 లభిస్తుందన్నట్లు. దీన్ని 12 నెలల పాటు విభజిస్తే ప్రతి నెలా రూ.9250 ఆదాయం వస్తుంది.పోస్టాఫీసు నిబంధనల ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఎంఐఎస్‌లో జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఖాతాలో వచ్చిన ఆదాయం ప్రతి సభ్యునికి సమానంగా ఇవ్వబడుతుంది. జాయింట్ ఖాతాను ఎప్పుడైనా ఒకే ఖాతాగా మార్చుకోవచ్చు. ఒకే ఖాతాను ఉమ్మడి ఖాతాగా కూడా మార్చుకోవచ్చు.
ఖాతాను ఎవరు తెరవగలరు?
ఏ దేశ పౌరుడైనా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో ఖాతాను తెరవవచ్చు. పిల్లల పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, అతని తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు వారి పేరు మీద ఖాతాను తెరవవచ్చు. పిల్లలకి 10 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతను ఖాతాను స్వయంగా నిర్వహించే హక్కును పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో చేరాలంటే పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలలి. ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అందించడం తప్పనిసరి. మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకుంటే నష్టం వస్తుంది. అందుకే మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలు. మధ్యలో మూసివేసేందుకు అవకాశం ఉండదు. అయితే, డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం.. మీరు ఒక సంవత్సరం, మూడు సంవత్సరాల మధ్య డబ్బును ఉపసంహరించుకుంటే, డిపాజిట్ మొత్తంలో 2% తీసివేసి తిరిగి ఇస్తారు. మీరు ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్‌డ్రా చేస్తే, మీ డిపాజిట్‌లో 1% కట్ చేస్తారనే విషయం గుర్తించుకోండి.