Post Office: పోస్టాఫీసు స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో కీలక మార్పులు

Post Office: పోస్టాఫీసులో రకరకాల పొదుపు పథకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు మరింతగా ..;

Update: 2024-01-08 13:06 GMT

Post office Scheme

Post Office: పోస్టాఫీసులో రకరకాల పొదుపు పథకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు మరింతగా అభివృద్ధి చెందాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు సైతం పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అధిక రాబడి అందించే స్మాల్‌ సేవింగ్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది కేంద్రం.

పోస్టాఫీసులు అందించే పథకాలు ఇవే..

1. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (MSSC)

2. పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ (SB)

3. నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (RD)

4. సుకన్య సమృద్ధి అకౌంట్‌ (SSA)

5. నేషనల్‌ సేవింగ్స్‌ టైమ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (TD)

6. కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP)

7. నేషనల్‌ సేవింగ్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ (MIS)

8. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం అకౌంట్‌ (SCSS)

9. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ (PPF)

10. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ (SSC)

ఈ పథకాలలో కీలక మార్పులు:

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌: 2023 బడ్జెట్‌లో సింగిల్‌ అకౌంట్‌ యూజర్ల కోసం ఈ పథకం డిపాజిట్‌ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్‌ ఖాతాదారుల కోసం రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌: ఎస్‌సీఎస్‌ఎస్‌లో గరిష్ఠ పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది కేంద్రం. దీని ద్వారా డిపాజిట్లపై అధిక వడ్డీరేటును పొందే అవకాశాన్ని సీనియర్‌ సిటిజన్స్‌కు కల్పించారు.

పీపీఎఫ్‌ వడ్డీ: పీపీఎఫ్‌ స్కీం 2019 కింద రెగ్యులర్‌గా జమయ్యే వడ్డీ కంటే 1 శాతం తక్కువగా ముందస్తు ఉపసంహరణ పథకాలపై వడ్డీ ఉంటుంది. ప్రస్తుతమున్న ఐదేండ్ల బ్లాక్‌ పీరియడ్‌ నుంచి దీన్ని లెక్కించడం జరుగుతుంది.

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పెనాల్టీ: ఇక పోస్టాఫీస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను నిర్ణీత కాలవ్యవధి కంటే ముందే విత్‌డ్రా చేసినట్లయితే 2 శాతం జరిమానా విధిస్తారు. సదరు ఎఫ్‌డీలకు నిర్ణయించిన వడ్డీరేటులో 2 శాతం తగ్గించి చెల్లిస్తారు.

Tags:    

Similar News