Post Office: ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ అకౌంట్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?

మనం పోస్టాఫీసులో అలాగే బ్యాంకుల్లో పొదుపు ఖాతా తెరవవచ్చు . పొదుపు చేసుకోవడానికి ఇది గొప్ప మార్గం. మినిమమ్ బ్యాలెన్స్..

Update: 2023-12-02 02:55 GMT

మనం పోస్టాఫీసులో అలాగే బ్యాంకుల్లో పొదుపు ఖాతా తెరవవచ్చు . పొదుపు చేసుకోవడానికి ఇది గొప్ప మార్గం. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించడం వల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. అయితే, బ్యాంక్ ఖాతా లాగా, నిర్దిష్ట కాలానికి ఎటువంటి లావాదేవీలు జరుగకపోతే పోస్టాఫీసు ఖాతా క్లోజ్‌అవుతుంది. ఈ ఖాతా నుండి వరుసగా లావాదేవీలు జరుగకపోతే , అలాగే మూడు ఆర్థిక సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేయకపోతే లేదా విత్‌డ్రా చేయకపోతే అకౌంట్‌ డీయాక్టివేట్‌ అవుతుంది.

పోస్టాఫీసు డీయాక్టివేట్‌ అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. అందుకు సంబంధిత పోస్టాఫీసుకు వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ KYC రికార్డ్‌తో పాటు. పాస్ బుక్ సమర్పించాల్సి ఉంటుంది.

► పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు:

► పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా తెరవాలంటే రూ.500 డిపాజిట్ చేయాలి.

► ప్రస్తుతం ఈ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు రూ. 4% వడ్డీ లభిస్తుంది.

► మీరు ఒకేసారి మీ ఖాతాలో జమ చేయగల కనీస మొత్తం రూ. 100 నుంచి డిపాజిట్‌ చేయవచ్చు. .

► మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తం రూ.50 కంటే ఎక్కువ ఉండాలి.

► డిపాజిట్ చేయడానికి పరిమితి లేదు. ఖాతాలో ఎంత డబ్బు అయినా జమ చేయవచ్చు.

► నెల 10వ తేదీ నుండి నెలాఖరు వరకు కనీస బ్యాలెన్స్ మొత్తానికి వడ్డీ చెల్లిస్తారు. అయితే, ఈ మొత్తం రూ. 500 కంటే తక్కువ ఉంటే, అప్పుడు ఎలాంటి వడ్డీ లభించదు.

► పోస్టాఫీసు ఖాతాలో కనీస నిల్వ రూ.500 ఉండాలి. లేదంటే ఏడాదికి రూ.50 జరిమానా విధిస్తారు. బ్యాంకులాగా ప్రతి నెలా ఎలాంటి జరిమానా ఉండదు. జీరో బ్యాలెన్స్ ఉంటే పోస్టాఫీసు ఖాతా మూసివేస్తారు.

Tags:    

Similar News