RBI: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై ఆర్బీఐ నిబంధనలు కఠినతరం

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సి) దశలవారీగా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్

Update: 2024-01-16 12:05 GMT

RBI

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సి) దశలవారీగా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సూచించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFC) వాటిని మరింత సన్నిహితంగా ఉంచడం దీని లక్ష్యం. సామాన్య ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుంటున్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై కఠినంగా వ్యవహరించేందుకు బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సిద్ధమవుతోంది. డిపాజిట్లు తీసుకునే PNB హౌసింగ్ ఫైనాన్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్ వంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు NBFCల వలె నియంత్రణ ఉంటుంది.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ సమీక్షకు సంబంధించి ఆర్‌బిఐ ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌సిలకు వర్తించే నియంత్రణ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. NBFCలు అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, వాటాదారులు తమ సూచనలను 29 ఫిబ్రవరి 2024 లోపు ఇవ్వాలని RBI కోరింది.

డిపాజిట్లను స్వీకరించే విషయంలో నియంత్రణపరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఇది అన్ని వర్గాల ఎన్‌బిఎఫ్‌సిలకు వర్తిస్తుందని ఆర్‌బిఐ తెలిపింది. అటువంటి పరిస్థితిలో డిపాజిట్ అంగీకరించే ఎన్‌బిఎఫ్‌సిలకు వర్తించే రెగ్యులేటరీ నిబంధనలనే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తింపజేయాలని నిర్ణయించారు.

ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ లేని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పబ్లిక్ డిపాజిట్‌లను తీసుకోవడానికి లేదా ఇప్పటికే ఉన్న డిపాజిట్‌లను పునరుద్ధరించడానికి అనుమతి లేదని ఆర్‌బిఐ తన డ్రాఫ్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో పేర్కొంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పబ్లిక్ డిపాజిట్ల పరిమితిని మూడు రెట్లు కాకుండా వాటి మొత్తం నిధులకు ఒకటిన్నర రెట్లు తగ్గించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ముసాయిదా పత్రం అమలు, సర్క్యులర్ జారీ చేసిన తర్వాత జనవరి 15, 2024 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దేశంలో 9 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పబ్లిక్ డిపాజిట్లు తీసుకోవడానికి అనుతించింది ఆర్బీఐ.

ఈ కంపెనీలు ఇప్పుడు ఐదేళ్ల వరకు మెచ్యూరిటీ కాలానికి మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవచ్చు. గతంలో ఈ నిబంధన 10 ఏళ్లు ఉండేది. దీనిపై ఫిబ్రవరి 29 వరకు వాటాదారుల నుంచి సూచనలు కోరింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ మొత్తం లిక్విడ్ ఆస్తులను ఆమోదించిన సెక్యూరిటీలతో మార్చి 2025 నాటికి పబ్లిక్ డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుందని ఆర్‌బిఐ సర్క్యులర్‌లో పేర్కొంది. ఇతర రకాల నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల మాదిరిగానే డిపాజిట్లను స్వీకరించడానికి HFCలు అవే నిబంధనలను అనుసరిస్తాయి.

Tags:    

Similar News