ఖాతాలో డబ్బులు లేకపోతే పెనాల్టీ చెల్లించాలా? ఆర్బీఐ నిబంధనలు ఏంటి?

చాలా సార్లు బ్యాంకులు ఎటువంటి కారణం లేకుండా మన ఖాతా నుండి డబ్బును కట్‌ అవుతుంటాయి. అప్పుడు ఖాతా మైనస్‌గా మారుతుంది.;

Update: 2023-12-21 06:24 GMT
Bank Account, Bank Rules, RBI, RBI Rule, Bank balance,  Zero Account, rbi news, india

RBI

  • whatsapp icon

చాలా సార్లు బ్యాంకులు ఎటువంటి కారణం లేకుండా మన ఖాతా నుండి డబ్బును కట్‌ అవుతుంటాయి. అప్పుడు ఖాతా మైనస్‌గా మారుతుంది. ఖాతాని మూసివేయడం మినహా కస్టమర్‌కు వేరే మార్గం లేదు. అయితే మీరు అకౌంట్ క్లోజింగ్ కి వెళ్లినప్పుడు కూడా బ్యాంకు అధికారులు మీ అకౌంట్ క్లోజ్ చేయకపోగా, మైనస్ అమౌంట్ క్లియర్ చేసి మీ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మీరు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సేవింగ్స్ ఖాతాను తెరిచేటప్పుడు, బ్యాంక్ ఖాతా తెరిచిన తర్వాత ఖాతాలో కనీస నిల్వను నిర్వహించాల్సిన నిబంధనలు, షరతులను బ్యాంక్ తన ఖాతాదారులకు చెబుతుంది. కనీస బ్యాలెన్స్ పరిమితిని కూడా బ్యాంకు స్వయంగా నిర్ణయిస్తుంది. ఖాతాదారుడి ఖాతాలో కనీస నిల్వ లేకుంటే జరిమానా విధిస్తుంటుంది బ్యాంకు.


RBI రూల్ ఏం చెబుతోంది?

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఖాతాదారుడి ఖాతా నుంచి బ్యాంకు డబ్బును తీసివేయదు. అదే సమయంలో పెనాల్టీ పేరుతో కోత విధించడం ద్వారా బ్యాంకు ఖాతాదారుని ఖాతా నెగిటివ్ చేయదు. అయినప్పటికీ, ఏదైనా బ్యాంకు ఇలా చేస్తే, కస్టమర్ RBIకి వెళ్లి బ్యాంకుపై ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదు ఆధారంగా ఆ బ్యాంకుపై RBI చర్య తీసుకుంటుంది. మీకు కావాలంటే మీరు RBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుకు ఫిర్యాదు చేయడం ద్వారా కూడా పరిష్కారం లభిస్తుంది. చాలా సార్లు బ్యాంకులు ఆ మొత్తాన్ని తర్వాత వాపసు చేస్తాయి. మీరు వారి కస్టమర్ కేర్‌తో మాట్లాడి మీ సమస్య చెప్పాలి.

Tags:    

Similar News