Gold Price Today : గుడ్ న్యూస్ బంగారం ధరలు తగ్గుతున్నాయ్.. నేడే త్వరపడండి.. కొనేసేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అలాగే వెండి కూడా కొద్దిమొత్తంలోనే తగ్గింది.

Update: 2024-09-05 03:25 GMT

బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయన్న వార్తలు మాత్రం నిజం కావడం లేదు. గత పది రోజుల నుంచి ఒక్కసారి మాత్రమే బంగారం, వెండి ధరలు పెరిగాయి. మిగిలిన తొమ్మిది రోజుల్లో తగ్గుదల కనిపించింది. ఇది శుభసూచకమే. మగువలకు అత్యంత ఇష్టమైన వార్త ఇది. ఎందుకంటే బంగారం ధరలు పెరగకుంటే చాలు అని అనుకునే ఈ రోజుల్లో ధరలు దిగిరావడం అన్నది అసాధారణమేనని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అది ఎంతో కొంత పెరిగి భారంగా మారతాయి. అలాంటిది పది రోజుల నుంచి తగ్గడం అంటే మాటలు కాదని అంటున్నారు.

కొనుగోళ్లు పెరిగి....
బంగారం ధరలు తగ్గడంతో వాటి డిమాండ్ కూడా భారీగానే పెరిగింది. కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది దేశంలోనే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం పెళ్లిళ్ల సీజన్. మొన్నటి వరకూ పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారు. మరోవైైపు ప్రస్తుతం ముహూర్తాలు లేకపోయినా ధరలు తగ్గితే కొనుగోలు చేసి ముందస్తుగా బంగారాన్ని ఉంచుకుందామనుకున్న వారు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఇక పెట్టుబడి కోసం చూసే వారు సయితం బంగారం, వెండి వస్తువులను అదేపనిగా కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ పెరిగింది.
టుడే రేట్స్...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అలాగే వెండి కూడా కొద్దిమొత్తంలోనే తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. నిన్న మాత్రం వెండి కిలోమీద వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఇది ఉదయం ఆరు గంటలకు మాత్రమే. మధ్యాహ్నం తర్వాత ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,680 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర72,750 రూాపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరల 84,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News