Gold Price today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి

Update: 2024-08-24 03:47 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని అంచనా ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే తమకు అవసరం అయినప్పుడే కొనుగోలు చేసే వారు కొందరయితే.. బంగారం ధరలు తగ్గినప్పుడు కొనేవారు కూడా ఉన్నారు. రెండో రకానికి చెందిన వారు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే డబ్బులుంటే చాలు బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేవలం అవసరాలకే అయితే కొద్దిగా పసిడి, వెండి కొనుగోలు చేస్తారు. కానీ అవసరం లేకపోయినా తమ వద్ద బంగారం, వెండి ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.

చూస్తుండగానే...
పసిడికి ఎప్పుడూ డిమాండ్ పడిపోదు. మనం చూస్తుండగానే ధరలు పెరిగాయి. ప్రతి ఏడాదికి దాదాపు పదివేల రూపాయల వరకూ బంగారం ధరపై తేడా ఉంటుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల్లో ఇటీవల కాలంలో కొనుగోలు శక్తి పెరగడంతో పాటు బంగారం ఉంటే భద్రత ఉంటుందని భావించిన కస్టమర్లు గోల్డ్ ను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. బంగారాన్ని స్టేటస్ సింబల్ గా భావించడమే కాకుండా తమకు అవసరమైన సమయంలో మార్పిడి, లేదా సులువుగా అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు వీలున్న వస్తువు కావడంతో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో వెండి కూడా అంతే. అది కూడా ఇంట్లో ఎంత ఉంటే అంత శుభంగా భావిస్తారు.
ఈరోజు ధరలు...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయల ధర తగ్గింది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గడంతో పసిడి ప్రియులకు కొంత ఊరట కలిగించే విషయమేనని చెప్పాలి. హైదారాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,640 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 91,6000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News