Gold Price: అనుకుంటున్నట్లే జరిగిందిగా.. మళ్లీ బంగారం దెబ్బ రుచి చూపించిందిగా
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ ఇంత మొత్తంలో పెరగలేదు;
బంగారం అంటే అంతే మరి. ఒకటి రెండు రోజులు తగ్గిందిని సంబరాలు చేసుకునేంత సమయం ఉండదు.. భారీగా ధరలు పెరగడానికి. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు చెబుతారు. కానీ అవన్నీ ట్రాష్ అంటుంటారు కొనుగోలుదారులు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వల్ల బంగారం ధరలు పెరుగుతాయంటారు కానీ ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నాయంటే కేవలం అవి మాత్రమే కారణం కాదని కొనుగోలు దారులు చెబుతుంటారు.
కావాలనేనా..?
కావాలని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బంగారం ధరలు పెంచుతారన్న అనుమానాలు కూడా అనేక మంది వ్యక్తం చేస్తుంటారు. అయినా కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు, పెళ్లిళ్లకు బంగారం విధిగా కొనుగోలు చేయాల్సి రావడంతో ఏమీ చేయలేకపోతున్నారు. బంగారం ధరలు ఎంత పెరిగినా సరే తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు అందరినీ జ్యుయలరీ దుకాణాల వైపు నడిపిస్తాయి. అందుకే వన్నె తగ్గని బంగారం ధరలు కూడా తగ్గుతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని అంటారు మార్కెట్ నిపుణులు.
భారీ పెరుగుదల...
కొందరు పెట్టుబడిగా కూడా చూస్తుండటం కూడా ధరలు పెరుగుదలకు కారణమని చెబుతుంటారు. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయలు పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇంత మొత్తంలో పెరగలేదు. అలాగే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర పై 2,500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,650 రూాపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,890 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 79,500 రూపాయలుగా ఉంది.