అత్యధిక బంగారం నిల్వలున్న టాప్‌-10 దేశాలు.. భారత్ ఏ స్థానంలో?

బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా బంగారం నిల్వలు బాగానే ఉన్నాయి. బంగారం నిల్వల ..

Update: 2023-08-17 04:45 GMT

బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా బంగారం నిల్వలు బాగానే ఉన్నాయి. బంగారం నిల్వల ఆధారంగా దేశం ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తారు. మరి ప్రపంచంలో గోల్డ్‌ నిల్వలు ఏ మేరకు ఉన్నాయో తెలుపుకుందాం. జూన్ 2023 చివరి నాటికి అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాల గురించి తెలుసుకుందాం. మరి టాప్‌ 10 దేశాల్లో భారత్‌ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాం.

  1. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా: ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన అమెరికాలో బంగారం నిల్వలు భారీగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అక్కడ 8,133.46 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీంతో దేశంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశంగా గుర్తింపు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాకు దక్కిందని చెప్పాలి. ఇది కాకుండా, ఉత్తర అమెరికా దేశాలలో టాప్ 10 బంగారు నిల్వలను కలిగి ఉన్న ఏకైక దేశం ఇది.
  2. జర్మనీ: పశ్చిమ ఐరోపాలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఉన్న జర్మనీలో కూడా భారీగానే గోల్డ్‌ స్టాక్స్‌ ఉన్నాయి. ఇక్కడ 3,354.89 టన్నుల మేర బంగారం నిల్వలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జర్మనీ రెండో అతిపెద్ద బంగారు నిల్వ కలిగిన దేశంగా నిలిచిందని చెప్పవచ్చు.
  3. ఇటలీ: ఇక బంగారం నిల్వలు ఉన్న ఇటలీ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ 2,451.84 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీనితో, దేశం పశ్చిమ ఐరోపాలో రెండవ అత్యధిక బంగారు నిల్వలను కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూడవ అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉంది.
  4. ఫ్రాన్స్; ఫ్రాన్స్‌ విషయానికొస్తే ఇక్కడ బంగారం నిల్వలు 2,436.81 టన్నుల బంగారు నిల్వ ఉంది. దీనితో దేశం పశ్చిమ ఐరోపాలో మూడవ అతిపెద్ద బంగారు నిల్వలున్న దేశంగా, ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది.
  5. రష్యన్ ఫెడరేషన్: ఇక తూర్పు ఐరోపాలో అత్యంత ధనిక దేశాల్లో ఉన్న రష్యాలో బంగారం నిల్వలు 2,326.52 టన్నులు. రష్యా ఉక్రెయిన్‌తో వార్‌ కొనసాగుతున్నా... గోల్డ్‌ నిల్వల్లో ఏ మాత్రం తగ్గలేదు. అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్‌ 10 దేశాల్లో రష్యా ఉంది.
  6. చైనా: ఇక పొరుగు దేశమైన చైనా వద్ద కూడా భారీగానే బంగారం నిల్వలున్నాయి. ఇక్కడ 2,068.36 టన్నులకొద్ది నిల్వ ఉంది. 14 దేశాలతో తన సరిహద్దులను పంచుకుంటూ, అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశం. కమ్యూనిస్ట్ దేశం చైనా 6వ అతిపెద్ద బంగారు నిల్వ కలిగిన దేశంగా చైనా నిలిచింది.
  7. స్విట్జర్లాండ్: స్విట్జర్లాండ్‌ విషయానికొస్తే ఇక్కడ బంగారం నిల్వలు 1,040.00 టన్నుల బంగారం ఉంది. పశ్చిమ ఐరోపాలో అత్యధిక ఆదాయం కలిగిన దేశంగా పేరుంది. ఈ దేశం ప్రధాన ఆదాయ వనరు బ్యాంకింగ్, ఫైనాన్స్.
  8. జపాన్: జపాన్‌ చిన్న దేశమైన అభివృద్ధిలో ముందుంది. ఇక్కడ బంగారం నిల్వలలో టాప్‌ 10 దేశాల్లో చోటు లభించింది. జపాన్‌లో 846 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీంతో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో జపాన్‌ 8వ స్థానంలో ఉంది.
  9. భారతదేశం: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. మన దేశంలో 794.62 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే, టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం ఉంది.
  10. నెదర్లాండ్స్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా పేరున్న నెదర్లాండ్/హాలండ్ కూడా బంగారం నిల్వల్లో టాప్‌ 10 జాబితాలో ఉంది. ఇక్కడ 612.45 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉంది. ఈ దేశం టాప్ 10 జాబితాలో 10వ స్థానంలో ఉంది.

Tags:    

Similar News