డెబిట్ కార్డ్‌పై ఉండే 16 అంకెల అర్థం ఏంటి?
ఈ రోజుల్లో డెబిట్ కార్డు చాలా మందికి ఉంటుంది. చాలా మంది బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసే బదులు డెబిట్ కార్డు..
ఈ రోజుల్లో డెబిట్ కార్డు చాలా మందికి ఉంటుంది. చాలా మంది బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసే బదులు డెబిట్ కార్డు వాడుతూ డబ్బులను ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే ప్రతి కార్డ్‌లో ౧౬ నంబర్‌లు ఉంటాయి. ఇవి అందరికీ భిన్నంగా ఉంటాయి. కార్డుపై ఉండే ఆ సంఖ్యలకు ప్రత్యేక అర్థం ఉంటుంది. ఈ విషయం కొందరికి తెలిసినా చాలా మందికి తెలియకపోవచ్చు. కార్డులోని మొదటి 6 నంబర్లు బ్యాంకు గుర్తింపు సంఖ్య కాగా, మిగిలిన 10 నంబర్లు యూనిక్ అకౌంట్ నంబర్ . అంతేకాకుండా, కార్డుకు ప్రత్యేక హోలోగ్రామ్ ఉంది. ఇది నకిలీ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా, కార్డు చెల్లుబాటు కూడా కార్డుపై రాసి ఉంటుంది. మొదటి సంఖ్య మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్. అంటే, బ్యాంకు, పెట్రోలియం లేదా ఏదైనా పరిశ్రమను ఆ సంఖ్యతో అర్థం చేసుకోవచ్చు. కార్డ్‌లోని మొదటి 6 అంకెలు కార్డును జారీ చేసిన కంపెనీని సూచిస్తాయి. దీన్నే IINలేదా ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటారు.