హైదరాబాద్ శివారు ప్రాంతంలో గంజాయి చాక్లెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. షాద్ నగర్ లో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కిలోలకు పైగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాన్ షాపుల్లో విద్యార్థులకు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులే ....
ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో షాద్ నగర్ లో పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్ల రూపంలో గంజాయిని తయారు చేసి విక్రయిస్తున్నారు. పోలీసులు వలపన్ని పట్టుకుని నాలుగు కిలోల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.