నెత్తురోడిన జాతీయ రహదారి.. టిప్పర్ ఢీకొని..

బుధవారం తెల్లవారుజామున కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ.. 40వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది...;

Update: 2022-03-09 07:23 GMT

కర్నూలు రోజురోజుకీ రోడ్డుప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రహదారుల వెంబడి ఎన్ని సెఫ్టీ ప్రికాషన్స్ పెట్టినా.. వాహనదారులు వాటిని పట్టించుకోకుండా అతివేగంతో వాహనాలు నడపడం, రాంగ్ రూట్ లో రావడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి తప్పిదాలతో రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రతినిత్యం పదుల సంఖ్యలో ప్రజలు లేదా మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 20 గొర్రెలు మృతి చెందాయి.

బుధవారం తెల్లవారుజామున కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ.. 40వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు కాళ్లు విరిగి.. కొట్టుమిట్టాడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బేతంచెర్ల మండలం బుగ్గన పల్లి తండా, బుగ్గన పల్లె గ్రామానికి చెందిన పది మంది గొర్రెల కాపరులు 3000 గొర్రెలను మేత కోసం రాయమాలుపురము తీసుకుని వెళ్లడానికి మంగళవారం రాత్రి బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున జాతీయ రహదారి వెంట గొర్రెలను తోలుకుంటూ బలపనూరు మెట్ట సమీపంలో ఉన్న మైదానంలో గొర్రెలను నిలుపుకోవడానికి రోడ్డు దిగారు. అదే సమయంలో తమ రాజు పల్లిలో కంకర లోడ్ చేసుకొని నంద్యాల వైపు వస్తున్న టిప్పర్ వేగంగా దూసుకెళ్లడంతో 20 గొర్రెలు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News