పట్టపగలు మద్యం తాగి వాహనంతో రోడ్డుపైకి వచ్చి?

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి వాహనాన్ని నడపటంతో ఐదుగురికి గాయాలయ్యాయి;

Update: 2022-03-29 05:53 GMT

హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి వాహనాన్ని నడపటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఉదయాన్నే మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే 200 పాయింట్ల వరకూ నమోదయింది. ఉదయాన్నే మద్యం తాగిన యువకుడు రోడ్డుపైకి వచ్చి రెండు కార్లు ఒక ఆటోను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు.

క్షతగాత్రులను....
దీంతో అక్కడ స్థానికులు వెంటనే యువకుడిని పట్టుకున్నారు. పోలీసులు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News