పోలీసు అదుపులో మాజీ మంత్రి మేనల్లుడు
మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;
మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రజ్ రెడ్డికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అగ్రజ్ రెడ్డి తన స్నేహితులో కలసి వెళుతూ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మద్యం సేవించి...
పబ్ లో పూటుగా మద్యం సేవించిన అగ్రజ్ రెడ్డి అతని స్నేహితులు కలసి కారులో రాంగ్ సైడ్ లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అగ్రజ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసినట్లు తెలిసింది. మోతాదుకు మించి మద్యం సేవించి అగ్రజ్ రెడ్డి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయినట్లు తెలిసిదంది.