పోలీసులను రక్తం వచ్చేలా కొట్టారు
నిరసనకారులు పలు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా కలియాగంజ్ పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. అక్కడితో ఆగకుండా..
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్‌లో మైనర్ బాలిక మృతి కారణంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పలు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా కలియాగంజ్ పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. అక్కడితో ఆగకుండా పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక వీడియోలో, కోపంతో ఉన్న గుంపు బెంగాల్ పోలీసులని కొట్టడాన్ని చూడవచ్చు. దినాజ్‌పూర్‌లో రాజ్‌బొంగ్షి అనే గిరిజన బాలిక మృతిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఒక వీడియోను షేర్ చేశారు. నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నా కూడా పోలీసు సిబ్బంది సంయమనం ప్రదర్శించారని అన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో లాగా ప్రజల మీద కాల్పులు జరపలేదని అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్న వారిని, ఉద్రిక్తతలకు కారణమైన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని కునాల్ ఘోష్ అన్నారు.