కాల్పుల ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి

హైదరాబాద్ లో కాల్పుల జరిగనిన ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి చెందారు.;

Update: 2022-03-01 07:21 GMT

హైదరాబాద్ : హైదరాబాద్ లో కాల్పుల జరిగనిన ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు మృతి చెందారు. రియల్టర్లు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలు కాల్పుల ఘటనలో మృతి చెందారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలు కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు.

పది ఎకరాల భూ వివాదంలో....
ఇటీవలే పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి ఈ భూమిని శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి మట్టారెడ్డి అనే వ్యక్తి ఆక్రమణలో ఉంది. ఈ భూ వివాదంలో సెటిల్ మెంట్ కోసం అని పిలిచి ప్రత్యర్థులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. శ్రీనివాసరెడ్డి స్పాట్ లోనే మృతి చెందగా, రాఘవేంద్ర రెడ్డి కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ భూ వివాదంలో ఇద్దరు రియల్టర్లు హత్యకు గురయ్యారు.


Tags:    

Similar News