ప్రముఖ జానపద గాయకుడు ఆత్మహత్య !

చంపాపేటలో ఉంటోన్న గాయకుడు జటావత్ మోహన్ గతరాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..;

Update: 2022-03-16 10:05 GMT

చంపాపేట : హైదరాబాద్ నగరంలో ప్రముఖ జానపద గాయకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. చంపాపేటలో ఉంటోన్న గాయకుడు జటావత్ మోహన్ గతరాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఉదయం వరకూ మోహన్ ఆత్మహత్య విషయం ఎవరికీ తెలియలేదు. స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మోహన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు తరలించారు.

జటావత్ మోహన్ స్వస్థలం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పిల్లిగుండ్ల తండా. బంజారా పాటలు పాడుతూ.. మోహన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను పాడిన పలు బంజారా పాటలు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత జానపద నేపథ్య గాయకుడిగా మోహన్ పాటలు పాడటం ఆరంభించాడు. వృత్తిరీత్యా చంపాపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాగా.. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


Tags:    

Similar News