భార్య పోర్న్ లో నటించిందన్న అనుమానంతో భర్త ఏం చేశాడంటే..

రెండు నెలల క్రితం పోర్న్ వీడియోను చూసిన తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను కొట్టాడు. 20 రోజుల క్రితం మరోసారి దాడి చేసి..;

Update: 2022-04-19 06:35 GMT

బెంగళూరు : పోర్న్ సినిమాలు చూడటానికి బానిసగా మారిన ఓ వ్యక్తి అనుమానంతో తన అర్థాంగినే హతమార్చాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ గా పనిచేసే జహీర్ పాషా రెండు నెలల క్రితం మొబైల్ లో పోర్న్ సినిమా చూశాడు. అందులో ఉన్నది తన భార్యేనని పాషాకు అనుమానం వచ్చింది. అప్పట్నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లై 15 ఏళ్లు అవ్వగా.. ఐదుగురు సంతానం ఉన్నారు.

రెండు నెలల క్రితం పోర్న్ వీడియోను చూసిన తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను కొట్టాడు. 20 రోజుల క్రితం మరోసారి దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కూతుర్ని వేధిస్తున్న అల్లుడిపై మామ పోలీసులకు ఫిర్యాదు చేయబోగా అడ్డుకుంది. గత ఆదివారం పాషా మరోసారి ఆమెపై దాడి చేశాడు. తల్లిపై తండ్రి కత్తితో దాడి చేయడాన్ని చూసిన పెద్దకొడుకు.. విషయాన్ని తన తాతకు తెలిపాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వారు ఇంటికొచ్చేసరికే పాషా భార్య విగతజీవిగా పడి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News