ఆత్మహత్యకు పాల్పడిన శివాని.. పలు అనుమానాలు

శివాని ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.;

Update: 2022-07-22 08:15 GMT

బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో శివాని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని తన హాస్టల్ గది పైకప్పుకు ఉరి వేసుకుని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఆమె వయస్సు 21 సంవత్సరాలు. JSS అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసిస్తోంది. బీదర్‌కు చెందిన ఆమె మూడో సెమిస్టర్‌ చదువుతోంది. బుధవారం ఉదయం జరగాల్సిన పరీక్షకు శివాని రాకపోవడంతో మొదట అనుమానాలు తలెత్తాయి. దీంతో హాస్టల్ వార్డెన్ కావ్య శివాని గది తలుపు తట్టింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది అద్దాలు పగలగొట్టి చూడగా విద్యార్థిని ఉరికి వేలాడుతూ కనిపించింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

శివాని కాలేజీలో వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. శివాని ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీలో వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని, తమ కుమార్తె మృతికి న్యాయం చేయాలని శివాని తల్లిదండ్రులు ఆరోపించారు. కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్ష చేపట్టారు.


Tags:    

Similar News