ఫోటోలు సరిగా తీయలేదట.. ఫోటోగ్రాఫర్ ను ఏమి చేశారంటే?
బీహార్‌లోని దర్భంగాలో ఒక ఫోటోగ్రాఫర్ హత్యకు గురయ్యాడు. అతడి ఓ పుట్టినరోజు వేడుకకు
బీహార్‌లోని దర్భంగాలో ఒక ఫోటోగ్రాఫర్ హత్యకు గురయ్యాడు. అతడి ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్ళాడు. అతడి కెమెరా బ్యాటరీ డ్రైన్ అవ్వడంతో ఫోటోలు తీయలేకపోయాడు. దీంతో కోపం వచ్చిన బర్త్‌డే నిర్వాహకులు ఫోటోగ్రాఫర్ ను కాల్చి చంపారు. బాధితుడిని సుశీల్ సాహ్నిగా గుర్తించారు. రాకేష్ సాహ్ని అనే వ్యక్తి కుమార్తె పుట్టినరోజు వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. కెమెరా తీసే ఫోటోల మీద అసంతృప్తి వ్యక్తం చేసిన రాకేష్ సాహ్ని.. ఫోటోలు తీయమంటే కెమెరా లో బ్యాటరీ ఛార్జింగ్ లేదని కెమెరా మెన్ చెప్పడాన్ని సహించలేకపోయాడు. ఈ ఘటన దర్భంగా జిల్లాలోని బహెడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మఖ్నా గ్రామంలో చోటుచేసుకుంది.
బాధితుడు తన కెమెరా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.సుశీల్ సాహ్ని కనిపించకపోవడంతో రాకేష్ సాహ్ని అతనిని సంప్రదించి, బ్యాటరీని ఛార్జ్ చేసిన తర్వాత పార్టీకి తిరిగి రమ్మని కోరాడు. వచ్చాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఘటనా స్థలంలో ఒకరినొకరు తోసుకున్నారు. రాకేష్ సాహ్ని.. సుశీల్ పై పిస్టల్ పెట్టి కాల్చాడు. తీవ్ర రక్తస్రావమైన సుశీల్ ను నిందితులు దర్భంగా డిఎంసిహెచ్ ఆసుపత్రి గేటు వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే బాధితుడు మరణించాడని తెలుస్తోంది. ఇక నిందితుడి కుటుంబం మొత్తం పరారీలో ఉంది.
గ్రామపెద్ద తెలిపిన వివరాల ప్రకారం.. రాకేష్ సాహ్ని అక్రమ మద్యం వ్యాపారం చేస్తుండేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తీ చేసి.. కుటుంబీకులకు అప్పగించారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు దర్భంగా ఎస్‌ఎస్పీ తెలిపారు.