కరెన్సీ కట్టలు... ఈ వ్యాపారి ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు లభించడమా?

ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక షూ కంపెనీ వ్యాపారి ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి;

Update: 2024-05-21 05:35 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక షూ కంపెనీ వ్యాపారి ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలో విస్తుబోయే విధంగా నగదు కట్టలు బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.

షూ దుకాణాల వ్యాపారులే లక్ష్యంగా...
ఉత్తర్‌ప్రదేశ్ లో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపించడంతో ఆదాయపు పన్ను అధికారులు షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన పథ్నాలుగు ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. కేవలం 42 గంటల్లోనే 100 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News