సిగిరెట్ అతని ప్రాణం తీసింది
సిగిరెట్ అలవాటు ఒక వ్యక్తి ప్రాణం తసీింి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది;
సిగిరెట్ అలవాటు ఒక వ్యక్తి ప్రాణం తసీింి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే అరవై ఏళ్ల చంద్రకాంత్ కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచానికే పరిమితమయ్యాడు. అయితే కుటుంబ సభ్యులు ఈ నెల 11వ తేదీ రాత్రి భోజనం పెట్టిన తర్వాత బయటకు వెళ్లారు.
లేవలేని స్థితిలో...
భోజనం చేసిన తర్వాత చంద్రకాంత్ తన అలవాటును మానుకోలేక సిగిరెట్ ను అంటించుకున్నారు. నిప్పులు బెడ్ పై పడి మంటలు వ్యాపించాయి. మంచంపై నుంచి లేవలేని చంద్రకాంత్ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసే లోగా అరవై శాతం శరీరం కాలిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత చంద్రకాంత్ మరణించారు.