లోన్ యాప్ కేసులో ఈడీ దూకుడు
లోన్‌యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. చైనా కంపెనీలపై కఠిన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది
లోన్‌యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. చైనా కంపెనీలపై కఠిన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది. ప్రజల నుంచి దాదాపు 4,430 కోట్ల రూపాయలను చైనా కంపెనీలను దోచుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీలపై ఈడీ కొరడా విదిల్చింది. ఇప్పటి వరకూ 230 బ్యాంక్ అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది.
కోట్లాది రూపాయలు....
12 ఎన్‌ఎఫ్‌బీసీ కంపెనీకి అనుబంధంగా లోన్ యాప్ సంస్థలు ఉననాయి. వీటిలో ఇండిట్రేడ్, ఫిన్ క్రావ్, ఆగ్లో, ఫిన్ ట్రేడ్, ఫిన్ టెక్ కంపెనీలకు చెందిన నగదును సీజ్ చేశారు. వీటికి సంబంధించిన కొన్ని బ్యాంకుల్లో తాజాగా 105 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 819 కోట్ల రూపాయలు సీజ్ చేశారు.