తల వెంట్రుకల స్మగ్లింగ్ లో ఈడీ దూకుడు

తల వెంట్రుకల స్మగ్లింగ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది;

Update: 2022-02-15 04:06 GMT

తల వెంట్రుకల స్మగ్లింగ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. చైనా కు తలవెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్న ఏజెన్సీ కార్యాలయాలపై ఈడీ సోదాలను నిర్వహించింది. భారత్ లోని అనేక ప్రాంతాల నుంచి తలవెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టంబరు నెలలో హైదరాబాద్, మణిపూర్, మిజోరాంలలో సోదాలు నిర్వహించారు ప్రతి నెల 3.5 కోట్ల విలువైన వెంట్రులకను మణిపూర్, మిజోరాం మీదుగా మయన్మార్ కు తరలించినట్లు ఈడీ విచారణలో వెల్లడయింది.

హవాలా ద్వారా...
వెంట్రుకలను విక్రయించగా వచ్చిన కోట్లాది రూపాయలను హవాలా ద్వారా మళ్లిస్తున్నారని ఈడీ విచారణలో వెల్లడయింది. చైనా యాప్ ల ద్వారా బంగారం ద్వారా తిరిగి వెంట్రుకలు సరఫరా చేసిన కంపెనీలకు పంపుతున్నట్లు గుర్తించారు. ఇబ్రహీం పటేల్ డైరెక్టర్ గా ఉన్న నైలా ఫ్యామిలీ ఎక్స్ పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీల్లో సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసింది. ఈ సోదాల్లో ఈడీ అధికారులు 1.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి హవాలా ద్వారా మణిపూర్ లోని సెయింట్ మెరీస్ జెమ్ ఇండ్రస్ట్రీస్, సన్‌మూన్ హ్యూమన్ హెయిర్ చాంపాయి, ధారీ ఎంటర్ ప్రైజెస్, ఐజ్వాలాండ్, లూకాస్ థంగ్మాన్ గిలయానా సంస్థలు డబ్బులు మార్పిడి చేసినట్లు ఈడీ గుర్తించింది. వీటికి సంబంధించి 139 బ్యాంక్ ఖాతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది.


Tags:    

Similar News