భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. భర్త ఫిర్యాదు
తనకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్తపై భార్యఆగ్రహం వ్యక్తం చేసింది.;
తనకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్తపై భార్య(24) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపం పట్టలేక అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ నెల 7వ తేదీ జరిగిన ఈ ఘటన భర్త ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులొకిచ్చింది. జాతర పోలీస్ స్టేషన్ అధికారి తివేంద్ర త్రివేదీ తెలిపిన వివరాల మేరకు రామ్ నగర్ లో బాధిత భర్త (26) భార్యతో కలిసి ఉంటున్నాడు.
ఇష్టం లేకుండా...
ఆదివారం అతను ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. " నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది" అని బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2019లో వారికి వివాహం జరగ్గా.. కొన్ని గొడవల కారణంగా విడిపోయారు. పెద్దలు సర్దిచెప్పడంతో ఇటీవలే ఈ జంట మళ్లీ కలిశారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆయన వివరించారు. కాగా.. ఘటనానంతరం భర్త శస్త్ర చికిత్స చేయించుకుని ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా తెలిసిందని త్రివేదీ వివరించారు.