ఘోర ప్రమాదం.. పేలిపోయిన 100కి పైగా సిలిండర్లు
దానిని గమనించిన డ్రైవర్ లారీని ఆపి పక్కకు వెళ్లి.. పోలీసులు, ఫైర్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న 100కి పైగా సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామంవద్ద చోటుచేసుకుంది. గత అర్థరాత్రి తర్వాత 300కి పైగా గ్యాస్ సిలిండర్లతో ఉన్న లారీ అనంతపురం - గుంటూరు జాతీయ రహదారిపై వెళ్తోంది. కర్నూల్ నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు వెళ్లాల్సిన ఆ లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
దానిని గమనించిన డ్రైవర్ లారీని ఆపి పక్కకు వెళ్లి.. పోలీసులు, ఫైర్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు, అధికారులు జాతీయ రహదారిపై ఇరువైపులా అరకిలోమీటరు దూరంలో వాహనాలను ఆపివేశారు. మంటలు అదుపు చేసేలోపు ఒక్కో సిలిండర్ పేలింది. అలా 100 సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలాయి. అప్రమత్తమైన అధికారులు 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడ గ్రామంలో 30 ఇళ్లను వెంటనే ఖాళీ చేయించారు. ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు.