అందరూ బీహార్ వాసులే
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు మృతి చెందారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు మృతి చెందారు. మృతులంతా బీహార్ వాసులేనని చెబుతున్నారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. బోయిగూడలో ఒక స్క్రాప్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మృతులు వీరే....
జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా స్క్రాప్ గోదామును ఏర్పాటు చేయడంపై స్థానికులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. గోదాము యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మృతులు బిట్టు, సికిందర్, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్, దామోదర్, సత్యేందర్, చింటూలుగా గుర్తించారు. ప్రమాద సమయంలో 12 మంది కార్మికులు ఉండగా ఒకరు ప్రాణాలతో బయటపడ్దారు.