హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం... ఒకరి మృతి
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. రియల్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి. ఒకరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.;
హైదరాబాద్ : హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. రియల్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి. ఒకరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఈ కాల్పులు జరిగాయి. రియల్టర్ శ్రీనివాసరెడ్డి తనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జిరిపినట్లు చెబుతున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
ఘటనస్థలిలో మృతదేహం....
మరోవైపు ఘటన స్థలిలో ఒక మృతదేహం పోలీసులుక లభ్యమయింది. అయితే ఈ మృతదేహం ఎవరిదో తెలియడం లేదు. కారుకు కూడా రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా శ్రీనివాసరెడ్డిపై కాల్పులు జరిపారా? మరేదైనా కోణం ఉందా? అన్న రీతిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని అడిగి వివరాలను సేకరిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. వ్యాపారంలో కలహాలు, ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.