గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

తుపాకీ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అవ్వడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే రామయ్యను..;

Update: 2023-06-29 09:32 GMT

head conistable ramaiah dead

గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మింట్ కాంపౌండ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య (49) గన్ మిస్ ఫైర్ కావడంతో మృతి చెందారు. తుపాకీ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అవ్వడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే రామయ్యను చికిత్స నిమిత్తం నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింట్ కాంపౌండ్ లో రామయ్య హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం ఎస్ఎల్ఆర్ గన్ మిస్ ఫైర్ అయి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. రామయ్య స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటగా తెలిపారు.


Tags:    

Similar News