వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాహనాన్ని రోడ్డుపై నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాహనాన్ని రోడ్డుపై నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలను రోడ్డుపై పదిహేను రోజుల పాటు వదిలేస్తే తీవ్ర చర్యలుంటాయని ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాహనదారులు రోడ్డుపైనే వాహనం నిలిపేసి తమ సొంతూళ్లకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరానికి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని రోడ్డు పక్క నుంచి తొలగిస్తున్నారు.
రోడ్డుపై వదిలి వెళితే...
ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై రోడ్డుపై వాహనాలను వదిలి వెల్లడానికి వీల్లేదని చెప్పారు. రోజులు తరబడి వాహనాలను వదిలి వెళితే వాహనాన్ని సీజ్ చేస్తామని, కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు. భారీ జరిమానాను కూడా వాహనదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.