ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ మద్రాస్ ఐఐటీలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా.. తెలంగాణలోని బాసర ట్రిపుల్..

Update: 2023-07-09 13:44 GMT

దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. యాజమాన్యాల చదువు ఒత్తిడితోనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారా ? లేక ఇతర కారణాలున్నాయా ? అనేది మిస్టరీగా మారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ మద్రాస్ ఐఐటీలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా.. తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలోనూ ముగ్గురు విద్యార్థులు, ఐఐటీ బాంబేలో ఒకరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా ఐఐటీ ఢిల్లీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన ఆయుష్ అనే విద్యార్థి ఐఐటీ ఢిల్లీలో బీటెక్ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం (జులై 8) రాత్రి విద్యార్థి క్యాంపస్ లోని ఉదయగిరి హాస్టల్ లో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయుష్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


Tags:    

Similar News