యూపీలో ఘాతుకం.. టీచర్ పై విద్యార్థి కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘాతుకం జరిగింది. తనపై కోపడ్డారని భావించిన ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు జరిపాడు.;

Update: 2022-09-25 05:47 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘాతుకం జరిగింది. తనపై కోపడ్డారని భావించిన ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు జరిపాడు. మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మరొక విద్యార్థితో గొడవ పడ్డాడు. ఇది చూసిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పి ఇంటికి పంపించివేశారు.

మూడు రౌండ్లు కాల్పులు...
దీంతో అందులో ఒక విద్యార్థి తనను మందలించిన టీచర్ పై కోపం పెంచుకున్నాడు. ఒక నాటు తుపాకీని తెచ్చి టీచర్ పై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పుల జరిపారని ప్రతక్ష్య సాక్షులు చెబుతున్నారు. దీంతో పడిపోయిన టీచర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఉపాధ్యాయుడి ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం లక్నో ఆసుపత్రిలో ఉపాధ్యాయుడు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News