డ్రగ్స్ కు అలవాటు పడి మరణించిన హైదరాబాదీ
డ్రగ్స్ కు బానిసై ఒక యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.;
డ్రగ్స్ కు బానిసై ఒక యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. డ్రగ్స్ కు బాగా అలవాటుపడిన బీటెక్ విద్యార్థి ఒకరు గోవా వెళ్లి తరచూ డ్రగ్స్ తీసుకునే వాడు. మ్యూజిక్ పార్టీల పేరుతో తరచూ గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకునే వారు. గోవా నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు డ్రగ్స్ తీసుకుని వచ్చి హైదరాబాద్ లో కొందరికి విక్రయించి సొమ్ము చేసుకునే వారు. అయితే బీటెక్ విద్యార్థి డ్రగ్స్ కు అలవాటుపడి రోగిలా మారాడు.
బీటెక్ విద్యార్థులు....
వారం రోజుల నుంచి చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడు. డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లో మరణించిన తొలి కేసుగా పోలీసులు చెబుతున్నారు. తరచూ గోవాకు వెళ్లే వారిలో 9 మంది బీటెక్ విద్యార్థులుతో పాటు ఇద్దరు డీజేలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మొత్తం 23 మంది డ్రగ్స్ కు అలవాటు పడినట్లు గుర్తించామని, వీరంతా విద్యార్థులేనని పోలీసులు చెబుతున్నారు.