Liqour Death : మద్యం .. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఐదుగురిని చంపేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది;

Update: 2024-05-12 02:00 GMT

మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఐదుగురిని చంపేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ కు చెందిన అనురాగ్ సింగ్ మద్యం లేనిదే బతికలేని పరిస్థితికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్యం మానాలని అనేక రకాలుగా వత్తిడి తెచ్చారు. చివరకు డీ అడిక్షన్ సెంటర్ లోనూ చేర్చడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ తనను మద్యం మానుకోవాలని చెప్పిన కుటుంబ సభ్యులతో తరచూ ఘర్షణకు దిగేవారు.

మద్యం మానాలని అన్నందుకు...
అయినా కుటుంబ సభ్యులు మద్యం మానాలని తరచూ వత్తిడి తెస్తుండటంతో తట్టుకోలేక అనురాగ్ సింగ్ తన తల్లిని కాల్చిచంపాడు. భార్య ప్రియాంకను సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆపై ముగ్గురి పిల్లలను కూడా ఇంటిపై నుంచి తోసేసి చంపాడు. చివరకు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం ఒక కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలను బలి తీసుకుంది. మద్యం మానాలన్నందుకు కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలచి వేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News