Jamatara train accident:రైలులో నుండి పట్టాల మీదకు దూకేశారు

పుకార్లు, తప్పుడు వార్తలు ఎంతో మంది ప్రాణాలను తీస్తూ ఉంటాయి. తాజాగా ఝార్ఖండ్ లో

Update: 2024-02-29 07:13 GMT

Jamatara train accident:పుకార్లు, తప్పుడు వార్తలు ఎంతో మంది ప్రాణాలను తీస్తూ ఉంటాయి. తాజాగా ఝార్ఖండ్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం కూడా ఫేక్ న్యూస్ ద్వారా జరిగిందే!! జాంతారా-కర్మతండ్ మార్గంలోని కల్జ్‌హరియా సమీపంలో బుధవారం సాయంత్రం ఊహించని విషాదం చోటు చేసుకుంది. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న భగల్‌పూర్ వెళ్లే అంగ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు పక్కనున్న రైలు పట్టాలపైకి ఒక్కసారిగా దూకేశారు. అయితే అదే సమయంలో ఝంఝా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ అదే మార్గంలో రావడంతో రైలు కింద పడి మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

జమ్తారా రైలు ప్రమాదం: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది ప్రయాణికులు రైలునుండి పట్టాల మీదకు దూకేయడంతో.. మరో లోకల్ రైలు ఢీకొట్టారని అధికారులు తెలిపారు. ఈ ఘటన జమ్తారాలోని కలజారియా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ సమస్యపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తూర్పు రైల్వే సీపీఆర్వో కౌశిక్ మిత్ర తెలిపారు.


Tags:    

Similar News