హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్

హైదరాబాద్ పోలీసులు వారిని విచారించిన అనంతరం వారి లావాదేవీలపై దృష్టి సారించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2023-07-25 12:01 GMT

hyderabad drugs case

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, హాష్ ఆయిల్ మొదలగు మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ ఎస్ఓటి బృందం, నార్కోటిక్ బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు గుట్టు చప్పుడు కాకుండా మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముఠాలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. నార్కోటిక్ పోలీసులకు గత కొన్ని రోజుల క్రితం ఓ ముఠా పోలీసుల కంట పడకుండా రహస్యంగా డ్రగ్స్ ని హైదరాబాదుకు తరలిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే దాడులు చేసి.. ముగ్గురు నైజీరియన్ లతో పాటు ఇద్దరు ఇండియన్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ పోలీసులు వారిని విచారించిన అనంతరం వారి లావాదేవీలపై దృష్టి సారించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటికి మొన్న ఇన్వెస్ట్మెంట్ పేరుతో అమాయకమైన జనాలకు గాలం వేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి చైనా, దుబాయ్ కి తరలించినట్లుగానే ఈ డ్రగ్స్ కేసులో కూడా వచ్చిన ప్రాఫిట్ ను విదేశాలకు మళ్ళించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కోసం కస్టమర్ల నుండి వసూలు చేసిన నాలుగు కోట్ల రూపాయలు 22 విదేశీ అకౌంట్లకు మళ్ళించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ విధంగా మళ్ళించిన 22 అకౌంట్లను హెన్రీ అనే డ్రగ్ సప్లయర్ ఆపరేట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఆ 22 బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన కోసం ప్రైవేట్ ఏజెన్సీని ఆశ్రయించారు.
అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల వద్ద నుండి ఈ 200 మంది కస్టమర్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో 90% మంది బెంగళూరుకు చెందిన కస్టమర్లు ఉండగా.. మరో 10 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కస్టమర్లు ఉన్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్లుగా ఉన్నవారు గతంలో బెంగళూరులో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 22 అకౌంట్లను ఆపరేట్ చేస్తున్న డ్రగ్స్ సప్లయర్ కోసం వెతికేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.


Tags:    

Similar News