Manipur : మణిపూర్ లో మరోసారి హింస.. ఒకరి మృతి
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. కుకీ తిరుగుబాటు దారులు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. కుకీ తిరుగుబాటు దారులు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. టెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరెలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ కమాండో మృతి చెందారు. మోరె పట్టణ సమీపంలోని భద్రతా కార్యాలయంపై తిరుగుబాటు దారులు బాంబులు విసరగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
హింస చెలరేగుతుండటంతో...
మోరేలో ఇటీవల పోలీసు అధికారిని హత్య చేశారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈరోజు ఎదురుకాల్పులు జరిగాయి. మణిపూర్ లో గత కొద్ది రోజులుగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. భద్రతాదళాలు పెద్దయెత్తున పహారా కాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట హింస చెలరేగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.