మైనర్ బాలికపై ఫ్యాక్టరీ మేనేజర్ అత్యాచారం.. అతడికి భార్యే సహాయం చేసిందట..!

మైనర్ బాలికపై ఫ్యాక్టరీ మేనేజర్ అత్యాచారం.. అతడికి భార్యే సహాయం

Update: 2022-07-17 11:29 GMT

ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి యాసిడ్ పోసి చంపేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఫ్యాక్టరీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను తన భార్య సహాయంతో ఈ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అతని భార్య పరారీలో ఉంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. శుక్రవారం నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. సోదరిపై అత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకున్నామని ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు జై ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన సోదరి ఎయిమ్స్‌లో చేరిందని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. పోలీసులు శనివారం ఆస్పత్రికి చేరుకుని మైనర్ బాలిక వాంగ్మూలం తీసుకున్నారు. షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపింది.

జూలై 2న ఆమె ఫ్యాక్టరీ మేనేజర్ జై ప్రకాష్ ఏదో పని మీద ఇంటికి పిలిచాడు. అక్కడ భార్య సహాయంతో ఆమెపై అత్యాచారం చేశాడు. జూలై 5న ఆమె ఇంటికి వెళుతుండగా ఆమెకు విష పదార్థాన్ని ఇచ్చారు.. ఆమె ఇంటికి చేరుకుని స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. బాధితురాలు గత కొద్దిరోజులుగా వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదు..! కానీ ఆమె ఇటీవల తన కుటుంబ సభ్యులకు నిజం చెప్పింది. శుక్రవారం కుటుంబసభ్యులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మైనర్ కుమార్తెపై నిందితుడు యాసిడ్ పోశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని ఔటర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు. పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. నిందితుడి భార్య కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ విషయాన్ని గ్రహించి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నందున వెంటనే ఆస్పత్రిలోనే మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కమిషన్ పోలీసులను కోరింది.


Tags:    

Similar News