ఈ అమ్మాయి హార్ట్ అటాక్ తో మృతి

చిన్న వయసులోనే పలువురికి గుండె పోటు వస్తూ ఉండడం

Update: 2023-08-14 18:01 GMT

చిన్న వయసులోనే పలువురికి గుండె పోటు వస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. గుండెపోటుతో నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా నెరియా గ్రామంలో చోటుచేసుకుంది. మృతి చెందిన విద్యార్థిని సుమ(19)గా గుర్తించారు. మంగళూరులో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సుమకు ఇటీవల ఒంట్లో సరిగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంది. అనారోగ్యం కారణంగా ఆగస్టు 9న స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. అనంతరం ఆగస్టు 11న ఆమె తీవ్ర అనారోగ్యంతో మంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అక్కడ ఆమె కోలుకుంది. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం మళ్లీ అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో ఆమె మరణించింది.

నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర(22) ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా మరణించాడు. కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. యువకుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.


Tags:    

Similar News