ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 15 కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు;

Update: 2022-02-14 04:01 GMT

ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 15 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో గేట్ నెంబరు 11 లో పడేసి ఉన్న 51 కొకైన్ క్యాప్సూల్స్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వీటిని కస్టమ్స్ అధికారులు గుర్తిస్తారని అక్కడ పడవేసి పోయినట్లు భావిస్తున్నారు.

ప్రయాణికుల జాబితాపై....
అయితే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ కొకైన్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తీసుకున్నారు? అన్నదానిపై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పదిహేను కోట్ల విలువైన కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.


Tags:    

Similar News