హైదరాబాద్ లో థార్ దొంగల ముఠా.. మెరుపు వేగంతో దోపిడీ చేసి?
హైదరాబాద్ శివార్లలో దొంగల ముఠా అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడుతున్నాయి. దీనిని థార్ గ్యాంగ్ గా గుర్తించారు;
హైదరాబాద్ శివార్లలో దోపిడీ దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీనిని థార్ గ్యాంగ్ గా గుర్తించారు. ఈ గ్యాంగ్ ఇప్పటికే హయత్ నగర్, వనస్థలి పురం, ఎల్‌బి నగర్ ప్రాంతాల్లో ఈ ముఠా అనేక చోట్ల దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శివారు ప్రాంత గ్రామ ప్రజలు థార్ గ్యాంగ్ దెబ్బకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
మెరుపు వేగంతో...
ఇళ్లలోకి దూరడమే కాదు.. మూసి ఉన్న తలుపులు తట్టి మరీ ఈ థార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడుతుంది. మెరుపు వేగంతో దోపిడీ చేసి పారిపోవడంలో ఈ గ్యాంగ్ కు పెట్టింది పేరు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ని చూసి ఈ దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను థార్ ముఠాగా గుర్తించారు. పగటి వేళ సామాన్యులుగా తిరుగుతూ రాత్రి వేళ దోపిడీకి పాల్పడుతున్నారు. థార్ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు.