పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్ ని మోసం చేసిన యువకుడు

గుంటూరు జిల్లా కాకానికి చెందిన రోహిత్ ఖాన్ (24) బాధిత యువతి ఫోన్ నంబర్ సంపాదించి పరిచయం పెంచుకున్నాడు.;

Update: 2023-02-18 05:15 GMT
guntur crime news

guntur crime news

  • whatsapp icon

ప్రేమ, పెళ్లి పేరుతో వెంటాడి.. శారీరక వాంఛ తీరాక ముఖం చాటేస్తున్నారు కొందరు యువకులు. అలాంటి ఘటనలో హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్ ను గర్భవతిని చేసి.. ఆ తర్వాత ముఖం చాటేసి తిరుగుతున్న గుంటూరు జిల్లాకు చెందిన యువకుడిపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల యువతి 2021లో హైదరాబాద్ కు వచ్చి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. బోరబండలో నివాసం ఉంటోంది.

గుంటూరు జిల్లా కాకానికి చెందిన రోహిత్ ఖాన్ (24) బాధిత యువతి ఫోన్ నంబర్ సంపాదించి పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి.. ప్రేమిస్తున్నానని, మళ్లీ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఆ తర్వాత యువతి గర్భం దాల్చడంతో.. తనను పెళ్లిచేసుకోవాలని అడిగింది. అప్పటి నుండి అదిగో.. ఇదిగో అంటూ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. అతని చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఎస్సార్ నగర్ పోలీసులకు యువకుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News