ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు ఛేదించిన పోలీసులు

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. మట్టారెడ్డి ప్రధాన నిందితుడిగా తేల్చారు.

Update: 2022-03-03 06:01 GMT

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. మట్టారెడ్డి ప్రధాన నిందితుడిగా తేల్చారు. సుపారీ కిల్లర్ నవీన్ కు మట్టారెడ్డి డబ్బులు చెల్లించినట్లు కనుగొన్నారు. సుపారీ గ్యాంగ్ తోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిని మట్టారెడ్డి చంపించారని పోలీసుల విచారణతో తేలింది. ఇప్పటికే ఈ కేసులో మట్టారెడ్డి, హఫీజ్, నవీన్ లన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సుపారీ ఇచ్చి...
రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలను మట్టారెడ్డి చంపించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పది ఎకరాల భూ వివాదంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసులో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక సాక్ష్యాలతో విచారణ తర్వాత మట్టారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు అని పోలీసులు చెబుతున్నారు.


Tags:    

Similar News