జమ్మూ కాశ్మీర్ లో దొరికిన దొడ్డి కిరణ్

వైసీపీ నేత దొడ్డి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో రెవెన్యూ అధికారిపై దొడ్డి కిరణ్ దాడికి పాల్పడ్డారు.;

Update: 2022-02-05 07:03 GMT

వైసీపీ నేత దొడ్డి కిరణ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విశాఖలోని సత్యవాని పాలెంలో రెవెన్యూ అధికారిపై దొడ్డి కిరణ్ దాడికి పాల్పడ్డారు. భూమిని ఆక్రమించుకున్నందుకు అడ్డుకుంటుండగా రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. దీనిపై రెవెన్యూ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి దొడ్డి కిరణ్ కోసం పోలీసులు వెతుకుతున్నారుు. దొడ్డికిరణ్ ఇటీవల జరిగిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రెవెన్యూ అధికారిపై దాడి కేసులో....
విశాఖలోని వైసీపీ కీలక నేతకు ముఖ్య అనుచరుడిగా దొడ్డి కిరణ్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దొడ్డి కిరణ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించాయి. పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న దొడ్డికిరణ్ ను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. విమానంలో విశాఖకు తీసుకువచ్చారు. ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చే అవకాశముంది.


Tags:    

Similar News