ఫేక్ ప్రొఫైల్ తో యువతులకు వల.. అరెస్ట్

ఐపీఎస్ అధికారి పేరుతో నకిలీ ప్రొఫైల్ రూపొందించి మహిళలను వేధిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.;

Update: 2021-11-27 14:11 GMT

ఐపీఎస్ అధికారి పేరుతో నకిలీ ప్రొఫైల్ రూపొందించి మహిళలను వేధిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. మ్యాట్రిమోనీలో ఐపీఎస్ అధికారితో హరిప్రసాద్ అనే యువకుడు ఫేక్ ప్రొఫైల్ ను సృష్టించాడు. ప్రొఫైల్ చూసిన మహిళలు అనేక మంది హరిప్రసాద్ తో కాంట్రాక్ట్ అయ్యారు. వారిని హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించారు.

నకిలీ ఐడీ కార్డుతో....
అనుమానం వచ్చిన వారికి నకిలీ ఐడీ కార్డును చూపించి మభ్యపెట్టేవాడు. దీంతో ఒక బాధితురాలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరిప్రసాద్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News