హైదరాబాద్ లో గొలుసు దొంగ వీడే
హైదరాబాద్ లో వరసగా చైన్ స్నాచింగ్ లు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఉమేష్ ఖతిక్ గా గుర్తించారు.;
హైదరాబాద్ లో వరసగా చైన్ స్నాచింగ్ లు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఉమేష్ ఖతిక్ గా గుర్తించారు. ఉమేష్ ఖతిక్ ఆరు గంటల్లో ఆరు చైన్ స్నాచింగ్ లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు ఉమేష్ ఖతిక్ కోసం వేట ప్రారంభించారు. ఉమేష్ ఖతిక్ కోసం గుజరాత్, మహారాష్ట్రలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
వరస చైన్ స్నాచింగ్ లతో....
ఉమేష్ ఖతిక్ కుటుంబం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో స్థిరపడింది. వాస్తవానికి వీరు రాజస్థాన్ కు చెందిన వారు. మరో నిందితుడు దీపక్ తో కలసి గుజరాత్ లో ఉమేష్ ఖతిక్ అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇతను తొలిసారి 2015లో అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు. ఈ నెల18న నాంపల్లికి వచ్చిన ఉమేష్ ఖతిక్ అక్కడే ఉన్న మెజిస్టిక్ హోటల్లో బస చేశాడు. ముంబయి నుంచి వచ్చినట్లు హోటల్ రికార్డులో పేర్కొన్నాడు. 19న ఉదయం నుంచి చైన్ స్నాచింగ్ లు మొదలు పెట్టాడు. వరంగల్ కు వెళ్లిన ఉమేష్ ఖతిక్ అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.