గుత్తా సుమన్ కు బ్యాండ్ బాజా
పేకాటను వ్యాపారంగా మార్చుకుని కోట్లు సంపాదిస్తున్న గుత్తా సుమన్ పై పోలీసులు పీడీ యాక్ట్ ను నమోదు చేశారు;
పేకాటను వ్యాపారంగా మార్చుకుని కోట్లు సంపాదిస్తున్న గుత్తా సుమన్ పై పోలీసులు పీడీ యాక్ట్ ను నమోదు చేశారు. గుత్తా సుమన్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పేకటా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఫాం హౌస్ లలోనూ, ఫైవ్ స్టార్ హోటళ్లలో గుత్తా సుమన్ సంపన్నులలో పేకాట వ్యసనం ఉన్న వారిని పసిగట్టి వారి చేత ఆడించేవారు. కోట్ల రూపాయల్లో టర్నోవర్ చేసేవారు. పేకాటలోనూ డిజిటల్ మనీని ఉపయోగించేవాడు.
పీడీ యాక్ట్ నమోదు....
గుత్తా సుమన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను అడ్డగా చేసుకుని అనేక పేకాట కేంద్రాలను నడిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. దీంతో గుత్తా సుమన్ పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. ఇప్పటికే అతనిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. గోవా, శ్రీలంకలకు కూడా తీసుకెళ్లి అక్కడ పేకాట ఆడిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.