నేను బయటకు దూకా... వాళ్లు రాలేక దహనమయిపోయారు

బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనపై యజమాని సంపత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2022-03-23 12:42 GMT

బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనపై యజమాని సంపత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన బీహార్ కార్మికుడు ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో సంపత్ పై 304 ఎ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో 11 మంది బీహార్ కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రేమ్ కుమార్ జరిగిన విషయాన్ని చెప్పారు. స్ర్కాప్ గోదాం యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. తాము రెండేళ్లుగా గోదాములో పనిచేస్తున్నానని ప్రేమ్ కుమార్ చెప్పారు. తాము 11 మంది గోదాం మొదటి ఫ్లోర్ లో రాత్రి నిద్రించామని చెప్పారు.

ఫస్ట్ ఫ్లోర్ లో.....
ఫస్ట్ ఫ్లోర్ లోని చిన్న రూములో తను, బిట్టు, పంకజ్ నిద్రించామని, మరో పెద్దరూములో మిగిలిన తొమ్మిది మంది పడుకున్నారని తెలిపారు. రాత్రి మూడు గంటల సమయంలో పొగలు, మంటలు రావడంతో భయపడి బయటకు వచ్చేందుకు ప్రయత్నించామని చెప్పాడు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాను కిటికీలో నుంచి దూకేశానని, మిగిలిన వారు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారని ప్రేమ్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనను పోలీసులు ఆసుపత్రికి తరలించారని చెప్పారు.


Tags:    

Similar News