Road Accident : బస్సు బోల్తా - డ్రైవర్ మృతి పదిమందికి గాయాలు
విజయవాడ జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు;
విజయవాడ జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. మరికొందరికి గాయాలయ్యాయి.విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు.
నిద్రమత్తులో ఉండటమే...
డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పది మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.