శిల్పాకు షరతులతో కూడిన బెయిల్
శిల్పా చౌదరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది
శిల్పా చౌదరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. శిల్పా చౌదరి ప్రముఖులను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖులను టార్గెట్ చేసిన శిల్పా చౌదరి వారి నుంచి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. వాటిని రియల్ ఎస్టేట్ లోనూ, ఇతర కంపెనీల్లోనూ పెట్టుబడులు పెడతానని నమ్మకంగా చెప్పింది. దీంతో కోట్లాది రూపాయలు శిల్పా చౌదరి చేతుల్లో పోశారు.
కేసు పరిస్థితి ఏంటి?
కానీ ఎంతకీ తమ డబ్బులు చెల్లించకపోవడంతో శిల్పా చౌదరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇప్పుడు శిల్పా బెయిల్ పిటలషన్ పై విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసు ఇక నీరుగారిపోయినట్లేనని శిల్పా చౌదరికి అప్పు ఇచ్చిన బాధితులు ఆవేదన చెందుతున్నారు.